ఆంగ్ల భాష వ్యామోహంలో మధురమైన తెలుగు భాషను విస్మరిస్తున్నారు. ఆంగ్ల భాష కాటుక వంటిది. కాటుకను ఒళ్ళంతా పూసుకోకూడదు. పరమ సుందరమైన మన భాషలోనే మాడ్లాడుకుందాం అని హైదరాబాద్ లోని అవధాన సరస్వతీ పీఠం అధ్యక్షులు, అవధాన సహస్ర ఫణి, బృహత్ ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డా|| మాడుగుల ఫణిశర్మ గారు తెలుగు ప్రజలకు హితబోధ చేసారు.

చెన్నై లోని స్థానిక ఆరుంబాక్కం లోని డీ జీ వైష్ణవ కళాశాల తెలుగు శాఖ నవ్యభారతి, ఆంద్ర కళా స్రవంతి సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవధాని నాగఫణి శర్మ గారు మాట్లాడుతూ.. తెలుగు వారికి సొంతమైన పద్య విద్య, అవధానం అద్భుతమైన కళలని, ధారణ శక్తి ప్రపంచంలోనే  తెలుగు వాడి గొప్పతనమన్నారు. తెలుగు ప్రజలందరూ మన మాతృభాషలోనే మాట్లాడాలని, ఆంగ్లముపై వ్యామోహము వద్దని హితవు పలికారు. తెలుగు భాషను ఉద్ధరించడం అంటే సమాజాన్ని ఉద్ధరించడం కాదని, భాషా సేవ మనల్ని మనం ఉద్దరించుకోవడము వంటిదే అన్నారు. తెలుగు అభిమానం ప్రజల్లో ఇంకా ఇంకా వర్ధిల్లాలి అని అయన ఆకాంక్షించారు.


 0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top