గణపతి అధర్వశీర్ష హోమము - మహావిద్య  - చండీహోమము 

ప్రస్తుతము భారతదేశంలో జరుగుతున్న వివిధ అవాంఛనీయ పరిణామాల దృష్ట్యా భారతదేశ దిగ్విజయ సిద్ది కోసం, దేశ కళ్యాణము కోసము మరియు విశ్వ శాంతికై మార్చి 8 వ తారీఖు నుండి మార్చి 13 వరకు హైదరాబాదులోని అవధాన సరస్వతీ పీఠంలో  250 ఋత్విజులతో గణపతి అధర్వశీర్ష హోమము మరియు మహావిద్య  - చండీహోమములు బృహత్ ద్వి సహస్రావధాని బ్రహ్మశ్రీ డా|| మాడుగుల నాగఫణి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుచున్నవి.

అవధాన పరంపరలో భాగంగా మార్చి 9, 10 తేదీలలో  బ్రహ్మశ్రీ డా|| మాడుగుల నాగఫణి శర్మ గారిచే సంపూర్ణ సంస్కృతాంధ్ర శతావధానము ఉదయము 9 గం || ల నుండి రాత్రి 9 గం || ల వరకు జరుగును.

ఈ కార్యక్రమములో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్కృత విద్వాంసులు, ఉభయ తెలుగు రాష్ట్ర కవి పండితులు పాల్గొంటున్నారు. అవధాన సభలో కొంతమంది ముఖ్యులకు "సరస్వతీ పురస్కారం" అందిచబడును

గమనిక: పృచ్ఛకులుగా పాల్గొనే ఆసక్తి ఉన్నవారు, పద్యాలు రాయగలిగే వారు మరియు రచయితలు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు.
9989773849, 8179966893, 9440497262http://avadhanasaraswathipeetham.com/

0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top