శ్రీరస్తు 

పాశ్చాత్య పండితులు సమలాలీన భారతీయ విద్వాన్సులు సాయణభాష్యాన్ని అంగీకరించినారు. 
అన్నివేదాలకు సాయణుడు పూర్తిగా భాష్యం రాయడం, ఆ భాష్యాలు అందుబాటులో వుండడం ఇందుకు కారణం. వారి దృష్టిలో వేదం మొత్తం కాకపోయినా చాలామేరకు బహుదేవతారాధాకం.  యజ్ఞసంబంధం కాని విచిత్రమేమిటంటే వెడతాత్పర్యం మాత్రం యజ్ఞ సంబంధం కాదని సాయణుడే భావించాడు .

సాయణ భాష్యాన్ని అనుసరించే పండితులు, సాయణుడు స్వయంగా ఒక వేదాంతి అన్న విషయం మర్చిపోతున్నారు. సాయణుడి దృష్టిలో వేదాల్లోని సంహితలు, బ్రాహ్మణాలు, ఉపనిషత్తుల వైపు సూచిస్తున్నాయని ఉపనిషత్తులు అంతిమంగా అద్వైతాన్ని ప్రతిపాదిస్తున్నాయని వారు గుర్తించడములేదు. ఆమాటకొస్తే వేదాల్లోని సంహిత బ్రాహ్మణ విభాగం కూడా అంతిమ తాత్పర్యంలో ఆధ్యాత్మికం ఏకేశ్వరాత్మకం రహస్యం అని వాదింపవచ్చు. 
అన్నివేద పాఠశాలల్లో వేదభాష్యాలు అధ్యయనం చేస్తున్న విద్యార్థులు కేవలం సాయణ భాష్యానికే పరిమితం కాకుండా, మధ్వ దయానంద కపాలీశాస్త్రి వంటి వారి వ్యాఖ్యానాలు కూడా తప్పకచూడాలి. చదవాలి.  

పూర్వ ఉత్తర మీమాంమసలు తాము వేద సందేశాన్ని వ్యవస్థితం చేసి సమన్వయపరచి వ్యాఖ్యయాన్నిస్తున్నట్టుగా చెప్పుకొంటున్నాయి. మరొకవైపు యితిహాస పురాణాలు కూడా తాము వేదసందేశాన్ని మరింత స్పష్టంగా విశదీకరిస్తున్నమని పేర్కొంటున్నాయి. ఈ విధంగా చెప్పుకొంటున్న మాటల్లో సత్యం ఎంతవుందో వేద విద్వావంసులు ఎవరికివారే నిర్ణయించుకోవాలి. 

  1. వేదవేద్యే పరేపుంసి. జాతే దశరథాత్మజే  వేదః ప్రాచేతసాదాసీతాస్సాక్షాద్రామాయణాత్మనా 
  2. సర్వోపనిషదోగావః దుగ్ధం గీతామృతం మహత్ .
  3. నిగమ కల్పతరోర్గళితమ్ ఫలం - భాగవతం రసాలయం . 

ఈ మూడు గ్రంథాలు శ్రద్ద గా దీర్ఘకాలం చదివి వాటిసారాంశాన్ని అర్థంచేసుకొన్న  వాడెవడు ఈ సంప్రదాయాన్ని త్రోసిరాజనలేదు .

అవును . ఇంకను వివిధ శాస్త్రపరిజ్ఞానము ఉండాలి. లోక సందర్శన జ్ఞానము ఉండాలి. నానారాజ సందర్శనంలో తిరుపతివేంకటకవులు అన్నారు. వారు శాస్త్రపారంగతులు నేటికాలంలో డా|| మాడుగుల నాగఫణి శర్మ గారు వున్నారు. (యింకావున్నారేమో )
అవధాని అనువాడు నడుస్తున్న ఆర్ష గ్రంథాలయం అన్నమాట. పృచ్ఛకులు సైతం పాండిత్య శోభితులైవుండాలి.

------------------------------ 

0 comments:

Post a Comment

 
Avadhana Saraswathi Peetham - అవధాన సరస్వతీ పీఠం © 2018. All Rights Reserved.
Top